ఔటర్ రింగ్ రోడ్డుపై సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్( హరితహారం) ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
సాక్షి, హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డుపై సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్( హరితహారం) ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హరితహారంలో భాగంగా ఔటర్ వెంట చేపట్టిన పచ్చదనం పనులను, కీసర జంక్షన్‌లో నాటిన మొక్కలను ప్రియాంక వర్గీస్ పరిశీలించారు. మొక్కలకు నీటి సౌకర్యంపై జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
త్వరలోనే సీఎం కేసీఆర్ ఔటర్‌పై ప్రయాణించి పచ్చదనంను పరిశీలిస్తారని ఆమె తెలిపారు. ఎండిన మొక్కల స్థానంలో తక్షణం మంచి ఎత్తు ఉన్న మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. పర్యవేక్షణ లోపం ఉన్న కాంట్రాక్టర్లను పక్కన పెట్టాలని ప్రియాంక వర్గీస్ ఆదేశించారు.