రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వర్షాకాల విడిది నేటితో ముగిసింది. దాంతో బుధవారం ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరి వెళ్లారు.
హైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వర్షాకాల విడిది నేటితో ముగిసింది. దాంతో బుధవారం ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్, పలువురు మంత్రులు ..రాష్ట్రపతికి వీడ్కోలు పలికారు. హకీంపేటలోని విమానాశ్రయం నుంచి ప్రణబ్ ముఖర్జీ ఈరోజు ఉదయం 11 గంటలకు ఢిల్లీకి తిరిగి వెళ్లారు. ఆయన జూన్ 29న వర్షాకాల విడిదికి హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే.