స్వైన్‌ఫ్లూతో గర్భిణి మృతి | pregnant died of swineflu | Sakshi
Sakshi News home page

స్వైన్‌ఫ్లూతో గర్భిణి మృతి

Feb 8 2015 2:42 PM | Updated on Sep 2 2017 9:00 PM

స్వైన్‌ఫ్లూతో గర్భిణి మృతి

స్వైన్‌ఫ్లూతో గర్భిణి మృతి

స్వైన్‌ఫ్లూ వైరస్ కారణంగా ఆరు నెలల గర్భిణి మృతి చెందింది.

చిలకలగూడ(హైదరాబాద్): స్వైన్‌ఫ్లూ వైరస్ కారణంగా ఆరు నెలల గర్భిణి మృతి చెందింది. నల్లగొండకు చెందిన పర్వీన్ (32) ఆరు నెలల గర్భిణి. ఆమెకు స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారణ కావడంతో జిల్లా ఆస్పత్రి వైద్యులు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చేర్చాలని సూచించారు.. దీంతో ఈ నెల 5న పర్వీన్‌ను ఆమె కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మృతి చెందింది. దీంతో ఈ ఏడాది గాంధీలో స్వైన్‌ఫ్లూతో మరణించిన వారి సంఖ్య 32కు చేరింది. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో 27 మంది స్వైన్ ఫ్లూ బాధితులకు, పీఐసీయూలో ఏడుగురు చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు. అంతేకాకుండా 44 మంది స్వైన్‌ఫ్లూ అనుమానితులు కూడా చికిత్స పొందుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement