వినేవాడు వెర్రివాడైతే.. చెప్పేవాడు చంద్రబాబు! | Political analysts comments on Chandrababu | Sakshi
Sakshi News home page

వినేవాడు వెర్రివాడైతే.. చెప్పేవాడు చంద్రబాబు!

Sep 9 2016 8:53 AM | Updated on Jul 28 2018 3:33 PM

వినేవాడు వెర్రివాడైతే.. చెప్పేవాడు చంద్రబాబు! - Sakshi

వినేవాడు వెర్రివాడైతే.. చెప్పేవాడు చంద్రబాబు!

వినేవాడు వెర్రివాడైతే చెప్పేది చంద్రబాబు అన్న చందం మరోసారి నిజమైంది. తన అభివృద్ధిని అప్పటి ప్రధాని అమెరికాలోనూ మెచ్చుకున్నారని...

సాక్షి, హైదరాబాద్: వినేవాడు వెర్రివాడైతే చెప్పేది చంద్రబాబు అన్న చందం మరోసారి నిజమైంది. తన అభివృద్ధిని అప్పటి ప్రధాని అమెరికాలోనూ మెచ్చుకున్నారని మండలి సభ్యులను నమ్మించే ప్రయత్నం చేశారు చంద్రబాబు. ఇంతకీ విషయం ఏంటంటే.. తాను హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన విషయాన్ని అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు అమెరికా పర్యటనలో  పొగిడారని, మాక్కూడా మీలాంటి నగరాలున్నాయని హైదరాబాద్ పేరు చెప్పారని చంద్రబాబు గురువారం మండలిలో చెప్పారు. అయితే బాబు సీఎం అయింది 1995 సెప్టెంబరులో. పీవీ నరసింహారావు ప్రధానిగా 1996లో దిగిపోయారు. అంటే చంద్రబాబు పదవిలోకి వచ్చిన 8 నెలల్లోనే హైదరాబాద్‌ను ఎలా అభివృద్ధి చేశారని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement