హీరోయిన్‌ను చేస్తామని... | Police arrest two youth for cheating movie chances for kolkata model | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌ను చేస్తామని...

Jul 31 2015 8:54 AM | Updated on Aug 21 2018 6:12 PM

హీరోయిన్‌ను చేస్తామని... - Sakshi

హీరోయిన్‌ను చేస్తామని...

సినిమా హీరోయిన్‌ను చేస్తామని నమ్మబలికి ఇద్దరు కేటుగాళ్లు ఓ యువతిని వ్యభిచార కూపంలోకి నెట్టారు.

హైదరాబాద్ : సినిమా హీరోయిన్‌ను చేస్తామని నమ్మబలికి ఇద్దరు కేటుగాళ్లు ఓ యువతిని వ్యభిచార కూపంలోకి నెట్టారు. బాధితురాలిని బంజారాహిల్స్ పోలీసులు రెస్క్యూహోమ్‌కు తరలించి నిందితులను కటకటాల్లోకి నెట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. హనుమాన్ నాయక్, ఎం.లక్ష్మణ్ అనే ఇద్దరు యువకులు తాము దర్శక నిర్మాతలమంటూ నెలక్రితం కోల్‌కతాకు చెందిన ఓ మోడల్‌ను సంప్రదించి తాము కొత్తగా తీయబోయే సినిమాలో హీరోయిన్‌గా అవకాశం కల్పిస్తామని నమ్మ బలికారు.  ఆమె వారితో అంగీకారం కుదుర్చుకొని 20 రోజుల క్రితం నగరానికి వచ్చింది.

ఫిలింనగర్ వెంచర్- 2లో ఓ ప్లాట్‌ను అద్దెకు తీసుకొని ఆమెను అందులో ఉంచారు.  సినిమా తీస్తున్నట్లు ప్రచారం కల్పించి వీడియో కెమెరాతో ఆమెతో కొన్ని దృశ్యాలు కూడా పార్కుల్లో చిత్రీకరించారు. నిజంగానే సినిమా తీస్తున్నారని యువతి నమ్మింది. అయితే తనను వారు తమ అవసరాలకు వినియోగిస్తున్నారన్న విషయం పది రోజుల క్రితమే ఆమెకు తెలిసింది.

యువతి ఫొటోలు తీసి వాట్సాప్‌లో ఉంచి రేటు కూడా నిర్ణయించి వ్యభిచారిణిగా ప్రచారం చేశారు. దీంతో బలవంతంగా ఆమె వ్యభిచార కూపంలోకి నెట్టారు.  అయితే ఆ యువతికి చెందిన ఫొటోలు, వ్యభిచారిణి అంటూ రేటు కూడా వాట్సాప్‌లో ఉంచడటంతో పశ్చిమ మండలం పోలీసులు నిఘా వేసి పట్టుకున్నారు. బాధిత యువతిని అదుపులోకి తీసుకొని రెస్క్యూహోంకు తరలించారు. నిందితులను రిమాండ్‌కు పంపి బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement