పోలీసుల అదుపులో లేడీ చైన్ స్నాచర్ | Police arrest Lady Chain Snatcher | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో లేడీ చైన్ స్నాచర్

Aug 30 2013 3:12 AM | Updated on Nov 9 2018 5:02 PM

సంపన్న కుటుంబానికి చెందిన యువతి జల్సాలకు అలవాటు పడి మరో యువకుడితో కలిసి గొలుసు దొంగగా అవతారమెత్తింది.

బొల్లారం, న్యూస్‌లైన్: సంపన్న కుటుంబానికి చెందిన యువతి జల్సాలకు అలవాటు పడి మరో యువకుడితో కలిసి గొలుసు దొంగగా అవతారమెత్తింది. ఇప్పటివరకూ స్నాచింగ్ కింగ్‌లుగా పేరొందిన మగవాళ్ల స్థానంలో ఈ కి‘లేడీ’ ఇట్టే రాణించింది. పలువురి మహిళల పుస్తెల తాళ్లను తెంచేసిన మొట్టమొదటి లేడీ చైన్ స్నాచర్‌గా పేరొందింది. సిటీలో హాట్‌టాపిక్‌గా మారింది.
 
 గత కొన్ని నెలలుగా ఖాకీలను ముప్పతిప్పలు పెట్టిన ఈమె ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. ముంబై ప్రాంతానికి చెందిన ఈ యువతి(22) తన పాత మిత్రుడితో కలిసి హోండా యాక్టివా సాయంతో స్నాచింగ్‌లకు శ్రీకారం చుట్టింది. గతంలో నగరంలో ఉన్న ఈ యువతి తన విద్యాభ్యాసం అనంతరం కొద్ది రోజులు ప్రైవేటు ఉద్యోగం చేసింది. ఆ సమయంలో నగరంలో ఉన్న ఆమెకు పక్కింటి యువకుడితో పరిచయం ఏర్పడింది. సిటీ నుంచి ముంబై వెళ్లిన ఈ యువతి ఇటీవల నగరానికి తిరిగి వచ్చింది.
 
 పాత మిత్రుడితో కలిసి సికింద్రాబాద్ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని విలాసవంతమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. జల్సాలను తీర్చుకునేందుకు ఈ ఇద్దరూ చైన్ స్నాచింగ్‌లను ఆదాయమార్గంగా ఎంచుకున్నట్లు అదుపులో ఉన్న లేడి స్నాచర్ పోలీసులకు తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం. యువతితోపాటు పట్టుబడ్డ యువకుడు సంపన్న కుటుంబానికి చెందిన విద్యార్థని తెలిసింది. వీరి నుంచి పోలీసులు 60 తులాల బంగారం రికవరీ చేసినట్లు సమాచారం.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement