నోట్ల రద్దుపై విచారణను హైకోర్టు ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.
నోట్ల రద్దుపై విచారణ 16కు వాయిదా
Nov 14 2016 12:40 PM | Updated on Aug 31 2018 8:31 PM
హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దును కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ ఈనెల 16వ తేదీకి వాయిదా పడింది. నోట్ల రద్దుపై అనేక పిటిషన్లు వస్తున్నాయన్న న్యాయస్థానం వాటన్నింటినీ ఒకేసారి విచారణ చేస్తామని తెలిపింది.
కాగా సామాన్య జనాన్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించాలంటూ న్యాయవాది పీవీ కృష్ణయ్య ఈ పిటిషన్ దాఖలు చేశారు. కాగా రూ.500,1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం గత మంగళవారం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు.
Advertisement
Advertisement