‘ఉద్యమ ద్రోహులు ముఖ్య అతిథులా?’ | pidamarthi ravi fired on revanth reddy and uttam kumar reddy | Sakshi
Sakshi News home page

‘ఉద్యమ ద్రోహులు ముఖ్య అతిథులా?’

May 29 2016 2:47 AM | Updated on Sep 19 2019 8:44 PM

‘ఉద్యమ ద్రోహులు ముఖ్య అతిథులా?’ - Sakshi

‘ఉద్యమ ద్రోహులు ముఖ్య అతిథులా?’

‘తెలంగాణ ఉద్యమ ద్రోహులు టీడీపీ నేత రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో

హైదరాబాద్: ‘తెలంగాణ ఉద్యమ ద్రోహులు టీడీపీ నేత రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జూన్ 2న జరిగే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలకు ముఖ్య అతిథులా...?’ అని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ప్రశ్నించారు. శనివారం ఓయూ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కుదుర్చుకున్న చీకటి ఒప్పందంలో భాగంగానే వారి కనుసన్నల్లో ఓయూలో సభలు జరుగుతున్నాయని విమర్శించారు.

ప్రొఫెసర్ కోదండరామ్‌తో పాటు తాను కూడా విద్యార్థిగా తెలంగాణ ఉద్యమంలో  కీలకపాత్ర పోషించానని, ఓయూలో జరిగే సభకు ఆయనను ఆహ్వానించి తనను పిలవకపోవడం దురదృష్టకరమని పిడమర్తి రవి ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ నాయకులు దూదిమెట్ల బాలరాజ్‌యాదవ్, బండారు వీరీబాబు, గుండగాని కిరణ్‌గౌడ్, వడ్డె ఎల్లన్న, శంకర్‌నాయక్, మంద సురేశ్, సుధాకర్‌మాదిగ, కృష్ణమాదిగ,  భుట్టు శ్రీహరినాయక్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement