సినీహీరో ఉదయ్‌కిరణ్‌పై పీడీ యాక్ట్ | PD act filed against actor uday kiran | Sakshi
Sakshi News home page

సినీహీరో ఉదయ్‌కిరణ్‌పై పీడీ యాక్ట్

Apr 25 2016 8:27 AM | Updated on Apr 3 2019 8:57 PM

సినీహీరో ఉదయ్‌కిరణ్‌పై పీడీ యాక్ట్ - Sakshi

సినీహీరో ఉదయ్‌కిరణ్‌పై పీడీ యాక్ట్

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో, కాకినాడ, మాదాపూర్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సినీ హీరో నండూరి ఉదయ్‌కిరణ్(30)పై జూబ్లీహిల్స్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు.

హైదరాబాద్: మొదటిసారిగా నగర పోలీసులు సినీ హీరోపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో, కాకినాడ, మాదాపూర్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సినీ హీరో నండూరి ఉదయ్‌కిరణ్(30)పై జూబ్లీహిల్స్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు.

గత నెల 23వ తేదీ రాత్రి జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్ ఓవర్ ద మూన్ పబ్‌లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటమే కాకుండా సిబ్బందిని బెదిరించి హంగామా చేసిన ఘటనలో అరెస్టయ్యి చంచల్‌గూడ జైలులో ఉన్న ఉదయ్‌కిరణ్‌పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి ఆ మేరకు శనివారం జైలులోనే ఆయనకు నోటీసు కూడా జారీ చేశారు. మాదాపూర్ ఫార్చూన్ టవర్స్‌లో నివసించే ఉదయ్‌కిరణ్‌ది తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీలోని కమలాదేవి వీధి గాంధీనగర్. సినిమాలపై మోజుతో నగరానికి వచ్చి మూడు సినిమాల్లో హీరోగా నటించాడు. అయితే మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. తల్లి హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రభుత్వాస్పత్రిలో హెడ్‌నర్స్‌గా పని చేస్తున్నారు. అమ్మాయిలతో జల్సాలు, డ్రగ్స్, మద్యం, పబ్‌లు, క్లబ్‌లు, జూదం అలవాటుపడ్డ ఉదయ్‌కిరణ్ డ్రగ్స్ కేసులో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో నిందితుడిగా ఉన్నాడు. మొత్తం 10 కేసుల్లో ఆయన నిందితుడు. మాదాపూర్ పీఎస్‌లో నిర్భయచట్టం కింద కేసు నమోదై ఉంది. కాకినాడ వన్‌టౌన్, టుటౌన్ పోలీస్ స్టేషన్లలోనూ కేసులు నమోదై ఉన్నాయి. దీంతో పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement