ఆరు గ్రామ పంచాయతీ లను సిద్దిపేట మున్సిపాలిటీలో విలీనం చేయడానికి అనుకూలంగా హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
విలీన అభ్యంతరాలపై స్టేను తొలగించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఆరు గ్రామ పంచాయతీ లను సిద్దిపేట మున్సిపాలిటీలో విలీనం చేయడానికి అనుకూలంగా హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇన్నాళ్లూ వాయిదా పడుతూ వస్తున్న సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికలకు మార్గం సుగమమైంది. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో ఆరు గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ గతంలో మున్సిపల్ శాఖ నోటిఫై చేసింది.
విలీన పంచాయతీల పరిధిలోని ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా.. మున్సిపాలిటీలో విలీనం చేశారంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. విలీన పంచాయతీల పరిధిలో ప్రజాభిప్రాయాన్ని సేకరించిన అధికారులు వివరాలను కోర్టుకు సమర్పించారు. వివరాలతో సంతృప్తి చెందిన హైకోర్టు స్టేను తొలగించింది. దీంతో ఎన్నికకు మార్గం సుగమమైంది.