కాలిపోయిన భర్త.. బయటపడ్డ భార్య.. | one dies of fire accident in hyderabad | Sakshi
Sakshi News home page

కాలిపోయిన భర్త.. బయటపడ్డ భార్య..

Jun 4 2015 7:00 AM | Updated on Sep 5 2018 9:45 PM

నిర్మాణంలో ఉన్న భవనం పక్కన గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్న పెదల గుడిసెల్లో మంటలు చెలరేగాయి.

హైదరాబాద్: నిర్మాణంలో ఉన్న భవనం పక్కన గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్న పెదల గుడిసెల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో గుడిసెలో నిద్రపోతున్న భర్త మంటల్లో కాలి బూడిదకాగా..  భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నగరంలోని మెహదీపట్నం పరిధిలోని మల్లెపల్లిలో గురువారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న భవన సముదాయంలో కూలి పనులు చేయడానికి వచ్చిన కూలిలు అక్కడే గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు.

ఈ క్రమంలో బుధవారం పనుల అనంతరం భార్యా భర్తలు గుడిసెలో నిద్రిస్తున్నారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. దీంతో మంటల్లో చిక్కుకున్న భర్త కాలి బూడిదయ్యాడు. భర్యకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బాధితురాలిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement