ఈసారి కూడా డిస్క్జాకీలకు అనుమతిలేదు | No permission to disc jockey | Sakshi
Sakshi News home page

ఈసారి కూడా డిస్క్జాకీలకు అనుమతిలేదు

Aug 20 2014 4:03 PM | Updated on Sep 2 2017 12:10 PM

ఈసారి కూడా డిస్క్జాకీలకు అనుమతిలేదు

ఈసారి కూడా డిస్క్జాకీలకు అనుమతిలేదు

ఈసారి కూడా గణేశ్‌ ఉత్సవాలు, నిమజ్జనం సమయంలో డిజె(డిస్క్ జాకీ)లకు అనుమతి ఇవ్వకూడదని గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయించింది.

హైదరాబాద్: ఈసారి కూడా గణేశ్‌ ఉత్సవాలు, నిమజ్జనం సమయంలో డిజె(డిస్క్ జాకీ)లకు అనుమతి ఇవ్వకూడదని గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయించింది. గణేశ్‌ ఉత్సవాలు, నిమజ్జనం ఏర్పాట్లపై సచివాలయంలో ఉత్సవ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి  ఉపముఖ్యమంత్రి  మహమూద్‌ అలీ, హొం శాఖ మంత్రి  నాయిని నరసింహా రెడ్డి, ఎక్సైజ్ మంత్రి పద్మారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, ఉత్సవ సమితి ప్రతినిధులు, అఖిలపక్ష నేతలు, అన్నిశాఖల అధికారులు  హాజరయ్యారు.

గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఈ సారి కూడా డీజే(డిస్క్జాకీ)లకు అనుమతి ఇవ్వకూడదని తీర్మానించారు. హుస్సేన్‌సాగర్‌పై భారం తగ్గించి  నగర శివార్లలో కూడా నిమజ్జనం చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. గణేష్ మండపాలకు ఉచితంగా 24 గంటలూ విద్యుత్ సరఫరా చేయాలని గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు భగవంతరావు కోరారు.

సమావేశం ముగిసిన తరువాత ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హొం మంత్రి నాయని మాట్లాడుతూ  హైదరాబాద్ పరిధిలో చెరువుల ఆక్రమణలను పూర్తిగా తొలగిస్తామని  చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement