breaking news
Ganesh Utsavalu
-
గణేష్ ఉత్సవాలపై రేపు తలసాని సమావేశం
-
గణేష్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: గణేష్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. తొలిసారి దేవాదాయశాఖ ఆధ్వర్యంలో గంగాహారతిని ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై శ్రీనివాస్‌యాదవ్ అధ్యక్షతన హోం మంత్రి మహమూద్‌అలీ, మంత్రి మల్లారెడ్డి, మేయర్ బొంతు రాంమోహన్‌లు వివిధ శాఖల అధికారులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో సచివాలయంలో సమీక్షించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 55 వేలకు పైగా విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తలసాని చెప్పారు. ఖైరతాబాద్ గణేశుడి వద్ద 9 రోజులు సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. -
ఈసారి కూడా డిస్క్జాకీలకు అనుమతిలేదు
హైదరాబాద్: ఈసారి కూడా గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనం సమయంలో డిజె(డిస్క్ జాకీ)లకు అనుమతి ఇవ్వకూడదని గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయించింది. గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనం ఏర్పాట్లపై సచివాలయంలో ఉత్సవ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, హొం శాఖ మంత్రి నాయిని నరసింహా రెడ్డి, ఎక్సైజ్ మంత్రి పద్మారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఉత్సవ సమితి ప్రతినిధులు, అఖిలపక్ష నేతలు, అన్నిశాఖల అధికారులు హాజరయ్యారు. గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఈ సారి కూడా డీజే(డిస్క్జాకీ)లకు అనుమతి ఇవ్వకూడదని తీర్మానించారు. హుస్సేన్‌సాగర్‌పై భారం తగ్గించి నగర శివార్లలో కూడా నిమజ్జనం చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. గణేష్ మండపాలకు ఉచితంగా 24 గంటలూ విద్యుత్ సరఫరా చేయాలని గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు భగవంతరావు కోరారు. సమావేశం ముగిసిన తరువాత ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హొం మంత్రి నాయని మాట్లాడుతూ హైదరాబాద్ పరిధిలో చెరువుల ఆక్రమణలను పూర్తిగా తొలగిస్తామని చెప్పారు.