కిరణ్ ఉన్నారు...ఇటువైపు రాకండి | No entry for vehicles from Madhapur krituka layout area | Sakshi
Sakshi News home page

కిరణ్ ఉన్నారు...ఇటువైపు రాకండి

Feb 25 2014 9:25 AM | Updated on Jul 29 2019 5:31 PM

కిరణ్ ఉన్నారు...ఇటువైపు రాకండి - Sakshi

కిరణ్ ఉన్నారు...ఇటువైపు రాకండి

స్థానికంగా ఉన్న ఫంక్షన్ హాలులో శుభకార్యాలున్నప్పుడే ఆ ప్రాంతం బిజీబిజీగా ఉండేది.... విఐపీలు వచ్చినప్పుడే పోలీసుల హడావుడి కనిపించేది...

హైదరాబాద్ :  స్థానికంగా ఉన్న ఫంక్షన్ హాలులో శుభకార్యాలున్నప్పుడే ఆ ప్రాంతం బిజీబిజీగా ఉండేది.... విఐపీలు వచ్చినప్పుడే పోలీసుల హడావుడి కనిపించేది... అయితే రెండు రోజులుగా అపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆ ప్రాంతంలో సమావేశాలు ఏర్పాటు చేస్తుండటంతో సామాన్యులు అటువైపు వెళ్లేందుకు పోలీసులు అనుమతించటం లేదు. దీంతో సమీప భవనాల్లో నివాసముండే వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మాదాపూర్లోని కృతిక లేఅవుట్లోని ఓ భవనంలో కిరణ్ రెండు రోజులుగా ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

తాను ఏర్పాటు చేయబోయే కొత్త రాజకీయ పార్టీకి ఆ భవనాన్నే కార్యాలయంగా ఉపయోగిస్తారన్న ప్రచారం ఊపందుకోవడంతో పరిసర భవనాల్లోని వారంతా గగ్గోలు పెడుతున్నారు. బారికేడ్లు అమర్చి అటువైపు ఎలాంటి వాహనాలను అనుమతించకపోవటంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అక్కడి రెండు భవనాల్లో సాప్ట్వేర్ కంపెనీలు నిర్వహిస్తున్నారు.

మంచినీరు తీసుకొచ్చే వాహనాలనూ అనుమతించడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఇదిలా వుండగా, కిరణ్ కుమార్ రెడ్డి సమావేశాలు నిర్వహిస్తున్న భవనంలో పార్కింగ్ సౌకర్యం కూడా లేదు. దీంతో వాహనాలను ఖాళీ స్థాలాలు, రోడ్ల పక్కన, సమీపంలోని ఫంక్షన్ హాల్లో పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement