వారం రోజుల కిందట ప్రేమ వివాహం చేసుకున్న నవవధువు అనూహ్య రీతిలో అపహరణకు గురైంది.
హైదరాబాద్: వారం రోజుల కిందట హైదరాబాద్ లో ప్రేమ వివాహం చేసుకున్న నవవధువు అనూహ్య రీతిలో అపహరణకు గురైంది. శుక్రవారం ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన నవవధువు గౌతమి (25) కనిపించకుండా పోయిందని వరుడు శివకృష్ణ(24) హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
ఈ నెల 18న జీడిమెట్లలోని ఆర్యసమాజ్ లో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. కాగా, గౌతమిని ఆమె కుటుంబ సభ్యులే అపహరించి ఉంటారని భర్త శివకృ ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.


