మధుప్రియ వివాదంలో కొత్త ట్విస్ట్ | new angle blow in singer madhu priya insident | Sakshi
Sakshi News home page

మధుప్రియ వివాదంలో కొత్త ట్విస్ట్

Mar 13 2016 10:06 PM | Updated on Sep 3 2017 7:40 PM

మధుప్రియ వివాదంలో కొత్త ట్విస్ట్

మధుప్రియ వివాదంలో కొత్త ట్విస్ట్

వర్ధమాన గాయని మధుప్రియ వివాదంలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్: వర్ధమాన గాయని మధుప్రియ వివాదంలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.మధుప్రియను తన భర్త వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆదివారం పోలీసుల కౌన్సిలింగ్‌తో వివాదం సమసిపోయినట్టే కనిపిస్తోంది. కాగా, ఈ మొత్తం ఎపిసోడ్‌ మరో ఊహించని మలుపు తిరిగింది.

శ్రీకాంత్‌ అని భ్రమపడి శనివారం అర్థరాత్రి మహ్మద్‌ నయీమ్‌ అనే వ్యక్తిని మధుప్రియ బంధువులు చితకబాదారు. రామంతాపూర్‌లోని మ్యాట్రిక్స్ ఆసుపత్రిలో ఆ యువకుడికి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు బాదితుడు ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామంతాపూర్‌కు చెందిన మహ్మద్‌ నయీమ్‌ (30) అనే యువకుడు ప్రైవేట్ ఉద్యోగి. కొందరు గుర్తు తెలియని వక్తులు అతనిపై దాడి చేశారంటూ ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement