సీఎం కలల సాకారానికి కసరత్తు
బహుళ అంతస్తుల బాధ్యత ఆర్కిటెక్ట్ హఫీజ్‌కు అప్పగింత
ప్రణాళికలు రూపొందించాలని ఆదేశం
హుస్సేన్‌సాగర్ చుట్టూ అందమైన బహుళ అంతస్తుల భవనాలు.. మూసీ చుట్టూ కొత్త అందాలు.. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిబింబంగా తెలంగాణ కళాభారతి .. ఇలా ప్రపంచంలోనే ప్రత్యేకంగా... ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సిన నగరంగా గ్రేటర్‌ను తీర్చిదిద్దాలనుకుంటున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆ దిశగా తన ఆలోచనలకు కార్యరూపం ఇచ్చే పనిని ప్రారంభించారు. దీని కోసం ముంబైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ సేవ లను వినియోగించుకోనున్నారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై గురువారం జరిగిన సమావేశానికి హఫీజ్‌ను ఆహ్వానించారు. ఈ బహుళ అంతస్తుల భవ నాల నిర్మాణానికి ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదని... అందుకు తగిన ప్రణాళికలు రూపొందించాల్సిందిగా హఫీజ్ బృందాన్ని కోరారు. అంతేకాదు.. నగరంలోని ఏ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు వస్తే బాగుంటుందో పరిశీలించి ప్రణాళిక రూపొందిం చాలన్నారు.
హైదరాబాద్ నగరంప్రపంచంలోనే ప్రత్యేకంగా ఉండాలన్నారు. ఇదీ హఫీజ్ విశిష్టత.. ముంబై యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్‌లో డిప్లొమా, కొలంబియా యూనివర్సిటీలో డిగ్రీ, ఎంఎస్ పూర్తి చేసిన హఫీజ్ ఇంపీరియల్ 1, 2 భవనాలతో పాటు దేశంలోనే అత్యంత ఎత్తయిన భవనాల వాస్తుశిల్పిగా ప్రసిద్ధికెక్కారు. కొత్త పద్ధతులతో... అందరినీ ఆకట్టుకునేలా భవనాలను తీర్చిదిద్దడంలో పేరుపొందారు. హఫీజ్ ప్రాజెక్టుల్లో నోయిడా మహాగున్ మెడోస్, నవీ ముంబైలో డీవై పాటిల్ స్టేడియం, సీవుడ్స్ ఎస్టేట్ (ఎన్‌ఆర్‌ఐ కాంప్లెక్స్), గుర్గావ్‌లో డీఎల్‌ఎఫ్ అరాలియాస్, హీరానందర్ గార్డెన్స్ వంటివి ఉన్నాయి. దేశంలోని వివిధ నగరాల్లో ఎన్నో నిర్మాణాలతో పాటు ఓఎన్‌జీసీ గ్రీన్‌బిల్డింగ్స్‌కు రూపకల్పన చేశారు. ప్రముఖ నగరాల్లో ఇన్ఫోసిస్ బిల్డింగ్‌లు, ఏవీ బిర్లా ట్రైనింగ్ సెంటర్ నిర్మాణంలో ఆయన నైపుణ్యం కనిపిస్తుంది. నగరంలోని మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలను గతంలో హఫీజ్ సిద్ధం చేశారు. ఎందుకనో అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా బహుళ అంతస్తులతో పాటు మూసీ సుందరీకరణకు హఫీజ్ బృందం డిజైన్ చేయనుంది.
చేపట్టనున్న పనులు
మూసీ నది చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్త కట్టడాలు (పార్కులతో సహా) ఇందిరా పార్కు ఖాళీ స్థలంలో తెలంగాణ కళాభారతి (నాలుగు ఆడిటోరియంలతో సహా) రవీంద్ర భారతి ప్రదేశంలో హైదరాబాద్ చారిత్రక, సాంస్కృతిక ప్రత్యేకతలు చాటేలా నిర్మాణం మొజాంజాహి, చార్మినార్, హుస్సేన్‌సాగర్, సాలార్జంగ్ మ్యూజియంల వద్ద కొత్త ఆకర్షణలు టవర్లు, బహుళ అంతస్తుల భవనాలు చారిత్రక, వారసత్వ, సాంస్కృతిక లక్షణాలు ప్రతిబింబించడంతో పాటు ఆర్థికప్రగతికి దోహదపడేలా నిర్మాణం.
‘విశ్వ’మంత ఆశ
Published Fri, Dec 12 2014 12:17 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్‌లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్‌లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్‌కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- 100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
- ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement