ఎంఎస్‌వో హత్యకు నిరసనే కేబుల్ ప్రసారాల నిలిపివేత | MSOs stop airing channels in Telangana | Sakshi
Sakshi News home page

ఎంఎస్‌వో హత్యకు నిరసనే కేబుల్ ప్రసారాల నిలిపివేత

Dec 19 2015 9:18 PM | Updated on Sep 3 2017 2:15 PM

ఎంఎస్‌వో హత్యకు నిరసనే కేబుల్ ప్రసారాల నిలిపివేత

ఎంఎస్‌వో హత్యకు నిరసనే కేబుల్ ప్రసారాల నిలిపివేత

జీగ్రూప్‌కు చెందిన సిటీడిజిటల్, సిటీవిజన్ అనైతిక వ్యాపార ధోరణి, హత్యరాజకీయాలను నిరసిస్తూ ఫెడరేషన్‌ఆఫ్ తెలంగాణ ఎంఎస్‌ఓలు శనివారం సాయంత్రం కేబుల్ ప్రసారాలు నిలిపివేసి నిరసన తెలిపింది.

సాక్షి, సిటీబ్యూరో: జీగ్రూప్‌కు చెందిన సిటీడిజిటల్, సిటీవిజన్ అనైతిక వ్యాపార ధోరణి, హత్యరాజకీయాలను నిరసిస్తూ ఫెడరేషన్‌ఆఫ్ తెలంగాణ ఎంఎస్‌ఓలు శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కేబుల్ ప్రసారాలు నిలి పివేసి నిరసన తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 లక్షల కనెక్షన్లుకు ప్రసారాలు నిలిచిపోగా, ఒక్క గ్రేటర్ హై దారాబాద్‌లోనే సుమారు 20 లక్షల కనెక్షన్లకు ప్రసారాలు నిలిచిపోయాయి.

జీ గ్రూప్ యాజమాన్యం కనీసం బ్రాడ్‌కాస్ట ర్ల అనుమతి కూడా తీసుకోకుండా సొంతంగా డీటీహెచ్ ప్లాట్‌ఫాం(సిటీడిజిటల్, సిటీవిజన్)ను తయారు చేసుకుని కేబుల్ వ్యవస్థను నిర్వీర్యం చేయడమే కాకుండా జరుతున్న అన్యాయాన్ని నిలదీసిన పాల్వంచ ఎంఎస్‌ఓ మల్లెల నాగేశ్వర్‌రావును హత్య చేయించిందని, దీనికి నిరసనగా సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు కేబుల్ ప్రసారాలు నిలిపివేసి నట్లు ఫెడరేషన్‌ఆఫ్ తెలంగాణ ఎంఎస్‌ఓల అధ్యక్షుడు నర్సింగ్‌రావు, నాయకులు సుభాష్‌రెడ్డి, ఏచూరి భాస్కర్, పి.సు రేష్‌లు ప్రకటించారు. ఈ నెల 23న పాల్వంచలో సంతాప సభతో పాటు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement