నిందితులను కఠినంగా శిక్షిస్తాం : మంత్రి తలసాని | minister talasani srinivas yadav speaks over ramya Tributes | Sakshi
Sakshi News home page

నిందితులను కఠినంగా శిక్షిస్తాం : మంత్రి తలసాని

Jul 11 2016 6:55 PM | Updated on Sep 4 2017 4:37 AM

నిందితులను కఠినంగా శిక్షిస్తాం : మంత్రి తలసాని

నిందితులను కఠినంగా శిక్షిస్తాం : మంత్రి తలసాని

పంజాగుట్ట కారుప్రమాదానికి కారణమైన నిందితులను చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.

హైదరాబాద్: పంజాగుట్ట కారుప్రమాదానికి కారణమైన నిందితులను చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. కేబీఆర్ పార్క్ వద్ద సోమవారం సాయంత్రం రమ్యకు నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ...రమ్య కుటుంబానికి వచ్చిన పరిస్థితి ఎవరికీ రాకూడదన్నారు. చిన్నారి కుటుంబసభ్యులను సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి...న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ వహించాలని సూచించారు. రమ్య కుటుంబసభ్యులు మాట్లాడుతూ... ఈ ప్రమాదం కారణంగా మొత్తం కుటుంబాన్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చట్టాలను కఠినంగా అమలు చేయాలని ప్రజలు కోరారు. ఈ ర్యాలీలో రమ్య కుటుంబసభ్యులు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గాయని శోభారాణి, నటుడు కాదంబరి కిరణ్, శివాజీ, మంచు లక్ష్మీ, గజల్ శ్రీనివాస్తో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement