పనులు పరుగులు పెట్టాలి | Minister KTR in review of municipal corporations | Sakshi
Sakshi News home page

పనులు పరుగులు పెట్టాలి

Jul 5 2017 12:14 AM | Updated on Aug 30 2019 8:24 PM

పనులు పరుగులు పెట్టాలి - Sakshi

పనులు పరుగులు పెట్టాలి

రాష్ట్రంలోని మున్సిపల్‌ కార్పొరేషన్లకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తోందని..

మున్సిపల్‌ కార్పొరేషన్లపై సమీక్షలో మంత్రి కేటీఆర్‌
- అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులిస్తున్నాం..
ఈ నెల 10వ తేదీన విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తాం
కొత్త ప్రతిపాదనలు పరిశీలించి మంజూరు చేస్తామని వెల్లడి
చెత్త నుంచి విద్యుదుత్పత్తి చేసే ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశం
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మున్సిపల్‌ కార్పొరేషన్లకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తోందని.. అభివృద్ధి పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. పట్టణాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా ముం దుకు తీసుకెళ్లాలని, టెండర్లు పిలిచి పనులు వేగంగా పూర్తిచేయాలని ఆయా జిల్లాల కలెక్టర్ల ను ఆదేశించారు. మున్సిపల్‌ కార్పొరేషన్లలో అభివృద్ధి కార్యక్రమాలపై మంగళవారం హైదరాబాద్‌లోని మెట్రోరైల్‌ భవన్‌లో కేటీఆర్‌ సమీ క్షించారు. వరంగల్, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, ఖమ్మం నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు.

ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు, పురోగతిపై మంత్రి సమాచారం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు ఆయా నగరాల అవసరాల మేరకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రాజెక్టులపై ప్రతిపాదనలు అందజేశా రు. ఈ సందర్భంగా మున్సిపల్‌ కార్పొరేషన్ల మే యర్లు, కమిషనర్లు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఈ నెల 10న హైదరాబాద్‌లో విస్తృతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తామని కేటీఆర్‌ వెల్ల డించారు. మున్సిపల్‌ కార్పొరేషన్లలో అభివృద్ధి పనుల స్థితిగతులు, కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసుకుని ఆ సమావేశానికి రావాలని మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు అనుమతులు త్వరగా జారీ చేయాలని సీఎంవో అధికారులకు సూచించారు. వచ్చే నెలలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతో కలసి మహబూబ్‌నగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తామని తెలిపారు. బహిరంగ మలవిసర్జన రహిత పట్టణాలుగా గుర్తింపు పొందిన పట్టణాలు, నగరాల జాబితాను ఈ సందర్భంగా ప్రకటించనున్నట్లు వెల్లడించారు.
 
వ్యర్థ పదార్థాల విద్యుత్‌ ప్లాంట్లు చేపట్టండి
రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో వ్యర్థ పదార్థాల నుంచి విద్యుదుత్పత్తి చేసే ప్రాజెక్టులను చేపట్టాలని పురపాలక శాఖ అధికారులను కేటీఆర్‌ ఆదేశించారు. వారం లో ప్రాజెక్టు నిర్మాణ సంస్థలతో మాట్లాడాలని సూచించారు. వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తి చేసే ప్రాజెక్టులపై  సమీక్షించారు. అధి కారుల నుంచి పలు ప్రాజెక్టుల స్థితిగతుల ను తెలుసుకున్నారు. జీహెచ్‌ఎంసీ సహా రాష్ట్రంలోని పట్టణాల్లో చేపట్టిన వ్యర్థ పదా ర్థాల విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణాలు పలు కారణాలతో ఆగిపోయాయని అధికారులు మంత్రికి నివేదించారు. దీంతో ఆయా పనులను తక్షణమే పునః ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement