‘నన్ను తప్ప ఎవరిని చేసుకున్నా చంపేస్తా’ | man harassed young woman, banjara hills police filed nirbhaya case | Sakshi
Sakshi News home page

‘నన్ను తప్ప ఎవరిని చేసుకున్నా చంపేస్తా’

May 16 2017 6:40 PM | Updated on Oct 8 2018 3:07 PM

‘నన్ను తప్ప ఎవరిని చేసుకున్నా చంపేస్తా’ - Sakshi

‘నన్ను తప్ప ఎవరిని చేసుకున్నా చంపేస్తా’

‘నన్ను కాదని ఇంకెవరినీ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు.. ఇంకెవరితోనూ నీ పెళ్లి కానివ్వను..

హైదరాబాద్‌‌: ‘నన్ను కాదని ఇంకెవరినీ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు.. ఇంకెవరితోనూ నీ పెళ్లి కానివ్వను... ఒక వేళ వేరే ఎవరినైనా పెళ్లి చేసుకున్నావో వాడితో పాటు నిన్నూ యాసిడ్‌ పోసి చంపేస్తా.. అంటూ బెదిరిస్తున్న యువకుడిపై బంజారాహిల్స్‌ పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు.

ఎస్‌ఐ గోవర్ధన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఫిలింనగర్‌లోని గౌతంనగర్‌లో నివసించే బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్థినిని కొంత కాలంగా బీదర్‌కు చెందిన సందీప్‌(25) ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తననే పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్నాడు. ఆవారాగా తిరిగే నీతో నాకు పెళ్ళేంటి అంటూ విద్యార్థిని అభ్యంతరం తెలుపగా సందీప్‌ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఫేస్‌బుక్‌లో అసభ్య పోస్టింగ్‌లు చేస్తూ ఆమె పరువు ప్రతిష్టలను భంగపరుస్తున్నాడు. పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటుంటే అబ్బాయి వద్దకు వెళ్లి ఆమెతో తనకున్న సంబంధాలపై అసత్యప్రచారం చేయసాగాడు.

మూడు రోజుల క్రితం బీదర్‌కు చెందిన ఓ యువకుడితో పెళ్ళి నిశ్చయంకాగా సందీప్‌ ఆ యువకుడి ఇంటికి వెళ్లి తనకు యువతితో స్నేహం ఉందంటూ ప్రచారంచేసి పెళ్లి చెడగొట్టాడు. ఎన్ని సంబంధాలు వస్తున్నా వాటిని చెడగొట్టడమే కాకుండా ఫోన్‌ చేస్తూ, ఫేస్‌బుక్‌లో, వాట్సాప్‌లో ఆమెను ఇబ్బందులు చేయసాగాడు. దీంతో బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా సందీప్‌పై నిర్భయ కేసు నమోదు చేసి దర్తాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement