
‘తెలంగాణ ద్రోహి కుడి భుజమా?’
ఎన్నో కష్టాలకోర్చి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ దరిద్రంగా.. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన తుమ్మల నాగేశ్వర్‌రావు
సాక్షి, హైదరాబాద్: ఎన్నో కష్టాలకోర్చి తెలంగాణ ఇచ్చిన కాం గ్రెస్ దరిద్రంగా.. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన తుమ్మ ల నాగేశ్వర్‌రావు కుడి భుజంలా కనిపిస్తున్నారా అని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రశ్నించారు. గాంధీభవన్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ రాష్ట్రం ఇవ్వడం వల్లనే నేడు సీఎంగా కేసీఆర్, మంత్రులుగా కేటీఆర్, హరీశ్‌రావు, ఎంపీగా కవిత ఉన్నారన్నారు. పాలేరు ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ను, వైఎస్సార్ సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని బతిమిలాడి, బెదిరించి టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారన్నారు.