‘బీజేపీ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి’ | mala mahanadu dharna against bjp over SC classification | Sakshi
Sakshi News home page

‘బీజేపీ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి’

Dec 3 2016 3:51 PM | Updated on Mar 29 2019 9:31 PM

ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చిన బీజేపీ వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మాల మహానాడు డిమాండ్ చేసింది.

హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చిన బీజేపీ వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మాల మహానాడు డిమాండ్ చేసింది. బీజేపీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించింది. బీజేపీ తీరుకు నిరసనగా శనివారం నాంపల్లిలోని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయన్ని ముట్టడించేందుకు యత్నించిన మాలమహానాడు కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement