దళితులను వంచిస్తున్న కేసీఆర్: మధుయాష్కీ | madhuyasji fire's on kcr | Sakshi
Sakshi News home page

దళితులను వంచిస్తున్న కేసీఆర్: మధుయాష్కీ

Apr 15 2016 3:53 AM | Updated on Oct 8 2018 3:39 PM

దళితులను వంచిస్తున్న కేసీఆర్: మధుయాష్కీ - Sakshi

దళితులను వంచిస్తున్న కేసీఆర్: మధుయాష్కీ

ఒకవైపు అంబేడ్కర్‌కు విగ్రహాలు కడుతూ, దండలు వేస్తూ మరోవైపు దళితులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు

సాక్షి, హైదరాబాద్: ఒకవైపు అంబేడ్కర్‌కు విగ్రహాలు కడుతూ, దండలు వేస్తూ మరోవైపు దళితులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వంచిస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ ఆరోపించారు. గాంధీభవన్‌లో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ దళితులకు మూడెకరాల భూమి, ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పి వారిని మోసం చేశాడని విమర్శించారు. దళితులను మరోసారి మోసం చేయడానికే అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. దళిత జాతికి చెందిన రోహిత్ వేముల హంతకులకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉంటున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్, మోదీల అసలు స్వరూపాన్ని గుర్తించి, బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement