పోలీసులను ఆశ్ర యించిన ప్రేమజంట | love couple went to the police station | Sakshi
Sakshi News home page

పోలీసులను ఆశ్ర యించిన ప్రేమజంట

Oct 4 2016 11:11 AM | Updated on Sep 4 2018 5:24 PM

పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకున్న ఓ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది.

పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకున్న ఓ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. కుషాయిగూడ నాగార్జుననగర్ కాలనీకి చెందిన ఇందుభార్గవి(19), చాంద్ అలీ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారి వివాహానికి పెద్దలు అంగీకరించకపోవటంతో రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. అనంతరం తమకు ప్రాణాహాని ఉందని, బంధువుల నుంచి రక్షణ కల్పించాలంటూ మంగళవారం కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించారు. రెండు వర్గాల వారిని పిలిపించి, కౌన్సెలింగ్ చేస్తామని పోలీసులు తెలిపారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement