వరదల బారిన పడిన తెలంగాణను ఆదుకోవాలని మంత్రి కేటీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
న్యూఢిల్లీ: వరదల బారిన పడిన తెలంగాణను ఆదుకోవాలని మంత్రి కేటీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇటీవల కురిసిన ఎడతెరిపిలేని వర్షాల కారణంగా భారీగా వరదలు వచ్చి తెలంగాణలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఈ వర్షాలు ముఖ్యంగా హైదరాబాద్ ను ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ వరద తాలూకు నష్టాన్ని తెలంగాణ అంచనా వేసింది.
ఈ వివరాలను మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి అందించారు. హైదరాబాద్ లో జరిగిన నష్టానికి రూ.1189 కోట్ల సాయం ఇవ్వాలని కేటీఆర్ కోరారు. మరోపక్క, అక్రమంగా నాలాలను సైతం ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చివేత కార్యక్రమం కొనసాగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.