కృష్ణా పుష్కరాలకు ముహూర్తం ఖరారు | krishna pushkaralu starting time finalised in telangana | Sakshi
Sakshi News home page

కృష్ణా పుష్కరాలకు ముహూర్తం ఖరారు

Aug 10 2016 7:24 PM | Updated on Aug 14 2018 10:59 AM

కృష్ణా పుష్కరాలకు ముహూర్తం ఖరారు - Sakshi

కృష్ణా పుష్కరాలకు ముహూర్తం ఖరారు

తెలంగాణలో శుక్రవారం ఉదయం 5.58 గంటలకు కృష్ణా పుష్కరాలు ప్రారంభమవుతాయి.

హైదరాబాద్ : తెలంగాణలో కృష్ణా పుష్కరాల ప్రారంభ ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12వ తేదీ(శుక్రవారం) ఉదయం 5.58 గంటలకు కృష్ణా పుష్కరాలు ప్రారంభంకానున్నాయి.

కృష్ణా పుష్కరాలకు సీఎం కేసీఆర్ను దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హైదరాబాద్లో బుధవారం ఆహ్వాన పత్రిక ఇచ్చి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖాధికారులు, అర్చకులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా గొందిమల్లలో సీఎం కేసీఆర్ పుణ్యస్నానంతో పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఆగస్టు 12 నుంచి 23 వరకు కృష్ణా పుష్కరాలు జరుగనున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement