కేసీఆర్కు కోమటిరెడ్డి సవాల్ | komatireddy venkatreddy takes on kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్కు కోమటిరెడ్డి సవాల్

Oct 14 2016 2:14 PM | Updated on Aug 15 2018 9:35 PM

కేసీఆర్కు కోమటిరెడ్డి సవాల్ - Sakshi

కేసీఆర్కు కోమటిరెడ్డి సవాల్

కేసీఆర్ సర్వేల పేరుతో కాలం గడుపుతున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సర్వేల పేరుతో కాలం గడుపుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లాలో పార్టీ మారినవారితో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని, ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే 2019 ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని కోమటిరెడ్డి సవాల్ చేశారు.

ఎన్నికలు ఎప్పుడు జరిగినా కేసీఆర్ కూడా గజ్వేల్లో ఓడిపోతారని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. 31 కాదు 131 జిల్లాలు చేసినా టీఆర్ఎస్కు ఓటమి తప్పదని అన్నారు. కేసీఆర్కు ఎందుకు ఓట్లు వేయాలని, రుణమాఫీ చేయనందుకా, ఆరోగ్యశ్రీని పట్టించుకోనందుకా అని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement