కాచిగూడ-రేపల్లె ప్యాసింజర్ రైలును ఎక్స్‌ప్రెస్ రైలుగా మారుస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది.
రేపల్లె ప్యాసింజర్ ఇక ఎక్స్‌ప్రెస్
Jun 22 2017 12:35 PM | Updated on Sep 5 2017 2:14 PM
హైదరాబాద్: కాచిగూడ-రేపల్లె ప్యాసింజర్ రైలును ఎక్స్‌ప్రెస్ రైలుగా మారుస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. రైలు వేగాన్ని కూడా పెంచింది. దీనివల్ల ప్రయాణికులు గతంలో కంటే గంట ముందుగానే గమ్యస్థానం చేరుకుంటారని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. అక్టోబరు 19 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.
కాచిగూడ-రేపల్లె, తిరుగు ప్రయాణంలో రేపల్లె-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేశారు. ఈ రైలు కాచిగూడ(కొత్త నెం.17625) నుంచి ప్రతిరోజు రాత్రి 10.10 గంటలకు బయల్దేరి తెల్లవారుజామున 6.10కి రేపల్లె చేరుకుంటుంది. రేపల్లె(17626) నుంచి రాత్రి10.30కి బయల్దేరి ఉదయం 7.55కి సికింద్రాబాద్ చేరుకుంటుంది.
Advertisement
Advertisement