విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జారి కిందపడ్డారు.
విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జారి కిందపడ్డారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యులు సభలో మాట్లాడిన తీరును తప్పుపడుతూ ఆవేశపూరితంగా మాట్లాడిన ఎమ్మెల్యే పోడియం దిగే ప్రయత్నంలో కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు గాయమై రక్తస్రావమైంది. అక్కడున్న ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, టీడీపీ ప్రధాన కార్యదర్శి ప్రభాకరావులు వెంటనే తేరుకొని కిందపడిపోయిన ఎమ్మెల్యేని కూర్చోపెట్టారు. అయితే అక్కడే ఉన్న ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు ప్రమాదాన్ని పట్టించుకోకుండా మీడియాతో మాట్లాడుతూనే ఉండడం గమనార్హం.