టీడీపీ నేతలు క్షమాపణ చెప్పాలి | jac leaders fired on tdp leaders | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతలు క్షమాపణ చెప్పాలి

May 29 2016 2:30 AM | Updated on Aug 10 2018 9:42 PM

మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాల్లో ఇంజనీర్లు కమీషన్లు తీసుకుంటున్నారని మహానాడులో తెలుగుదేశం పార్టీ నేతలు..

తెలంగాణ ఇంజనీర్ల జేఏసీ
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ, మిష న్ భగీరథ పథకాల్లో ఇంజనీర్లు కమీషన్లు తీసుకుంటున్నారని మహానాడులో తెలుగుదేశం పార్టీ నేతలు వ్యాఖ్యానించడంపై తెలంగాణ ఇంజనీర్స్ జేఏసీ నేతలు మండిపడ్డారు. నిరాధార ఆరోపణలు చేసిన టీడీపీ నేతలు ఇంజనీర్లకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శనివా రం సచివాలయంలో మీడియా పాయింట్ వద్ద జేఏసీ నేతలు మాట్లాడారు. ప్రజలకు లబ్ధి కలిగించే ఎంతో ప్రతిష్టాత్మకమైన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను విజయవంతం చేయడానికి ఇంజనీర్లు ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement