సూది సైకో నుంచి 2 సిరంజీలు స్వాధీనం | injuction psyco cought in bhagyanagar express in secunderabad | Sakshi
Sakshi News home page

సూది సైకో నుంచి 2 సిరంజీలు స్వాధీనం

Sep 26 2015 12:31 PM | Updated on Sep 3 2017 10:01 AM

సూది సైకో నుంచి 2 సిరంజీలు స్వాధీనం

సూది సైకో నుంచి 2 సిరంజీలు స్వాధీనం

భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్లో సూది ఉన్మాది శనివారం కలకలం సృష్టించాడు.

సికింద్రాబాద్: భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్లో సూది ఉన్మాది శనివారం కలకలం సృష్టించాడు. బల్లార్షా నుంచి సికింద్రాబాద్ వస్తున్న భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్లో వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ వద్ద ఎక్కిన రవికుమార్ అనే సైకో ప్రయాణికులను సూదితో గుచ్చి గాయపరిచాడు. సూది ఉన్మాదిని ప్రయాణికులు చితకబాది సికింద్రాబాద్ ప్రభుత్వ రైల్వే పోలీసులకు అప్పగించారు.

 

ప్రయాణికులు అతడిని పట్టుకుని జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. పోలీసులు రవికుమార్ నుంచి రెండు సిరంజీలు, రెండు సిమ్ కార్డులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడిని దాదాపు గంట పాటు విచారించారు. రవికుమార్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే అతని మానసిక స్థితి బాగా లేదని పోలీసులు భావిస్తున్నారు. రెండు నెలల నుంచి ఇంటి దగ్గర ఉండట్లేదని కుటుంబ సభ్యులు కూడా చెప్పారు. అతడి దగ్గర రెండు సిరంజీలు, సూదులు, ఒక మందు సీసా కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులను కూడా విచారించిన తర్వాత పూర్తి విషయాలు తెలుస్తాయింటున్నారు. ఇతడికి, నగరంలో గతంలో జరిగిన ఘటనలకు సంబంధం ఉందా లేదా అనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement