ఏప్రిల్‌ ఒకటి నుంచి భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ 

Secunderabad Sirpur Kagaznagar Train: Bhagyanagar Express Resumed From April 1 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌– సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మధ్య నడిచే భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి పునరుద్ధరించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, అది స్పెషల్‌ ట్రైన్‌గానే ప్రయాణికులకు సేవలందించనుందని పేర్కొన్నారు. 

తిరుపతి–జమ్ముతావి (02277/02278) ఎక్స్‌ప్రెస్‌ను కూడా ఏప్రిల్‌ ఒకటి నుంచి పునరుద్ధరించనున్నారు. ఏప్రిల్‌ 30వ తేదీ వరకు నడుపనున్నట్లు గతంలో ప్రకటించిన 30 ప్రత్యేక రైళ్లను జూన్‌ నెలాఖరు వరకు పొడిగించినట్లు సీపీఆర్వో పేర్కొన్నారు.  

చదవండి: 

ఒక్కరూ లేరు, వింటే చోద్యం.. చూస్తే ఆశ్చర్యం

హైదరాబాద్‌లో ‘ఫ్రీ చాయ్‌ బిస్కెట్‌’: ఎక్కడంటే?

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top