
రోదసీలో వినూత్న ప్రయోగాలు భారత్ సొంతం
రోదసీ(అంతరిక్షం)లో వినూత్న ప్రయోగాలు చేయటంలో ప్రపంచంలోనే భారత్ ప్రత్యేక గుర్తింపు పొందిందని విక్రం సారా బాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురం డైరెక్టర్ డాక్టర్ కె.శివన్ అన్నారు.
రూ.కోట్ల ఖర్చుతో కూడిన రోదసీ ప్రయోగాల అంతిమ లక్ష్యం సామాన్య మానవులకు ప్రయోజనం కలిగించేందుకేనని వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతి థిగా హాజరుకావాల్సిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అనివార్య కారణాల వల్ల హాజరుకాలే దు. ఆయన ఆడియో, వీడియో సందేశాన్ని పంపా రు. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని, అన్ని రంగాల్లోనూ ప్రత్యేకించి అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో భారత్ ముందుకు దూసుకెళ్తోందని సందేశంలో వెంకయ్య పేర్కొన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలను సత్కరించడం అంటే.. వారిపట్ల ప్రజలకు ఉన్న గౌరవాన్ని తెలియజేయడమేనని అన్నారు. అనంతరం ఇస్రో శాస్త్రవేత్తలు డాక్టర్ శివన్, ఆర్.హుట్టన్, టి.సుందరమూర్తి, ఐ.సుధ, బేబీ అబ్రహం, బి.జయకుమార్, ఏజీ రాధాకృష్ణన్, కేపీ రాజ, దీపక్ నేజి, దీపా మురళీధర్‌లను మేడ్చెల్ గీతా ఆశ్రమ ఆధ్యాత్మిక గురువు సాయిబాబా చేతుల మీదుగా సత్కరించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్య కుమార్తె దీపా వెంకట్, ప్లాంజెరీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నారాయణ, రాజ్యలక్ష్మి దంపతులు తదితరులు పాల్గొన్నారు.