సీఎంకు భద్రత పెంచండి | Increase security safety to ap cm | Sakshi
Sakshi News home page

సీఎంకు భద్రత పెంచండి

Jan 12 2016 8:52 AM | Updated on May 29 2018 11:47 AM

సీఎంకు భద్రత పెంచండి - Sakshi

సీఎంకు భద్రత పెంచండి

ముఖ్యమంత్రి చంద్రబాబుకు భద్రతను పెంచాలని నిఘా విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

రాష్ట్ర ప్రభుత్వానికి నిఘా వర్గాల సూచన

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబుకు భద్రతను పెంచాలని నిఘా విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. సీఎం భద్రతపై పలు సూచనలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. సీఎం ప్రయాణించే హెలికాప్టర్, విమానాన్ని ప్రయాణానికి ముందు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని చెప్పింది.

అలాగే సీఎం నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ కృష్ణా నది ఒడ్డున ఉన్నందున, నదిలో మెకనైజ్డ్ బోట్‌లో పోలీసులతో 24 గంటలు పహారా పెట్టాలని సూచించింది. ఈ బోటులో గజ ఈతగాళ్లు, స్విమ్మింగ్ నెట్, సీఆర్‌పీఎఫ్ బలగాలు ఉండాలని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement