సౌండ్ తగ్గించమన్నాడని హత్య | In the case of elderly Murder of in the clash loudspeaker | Sakshi
Sakshi News home page

సౌండ్ తగ్గించమన్నాడని హత్య

Jan 19 2015 3:22 AM | Updated on Jul 30 2018 9:15 PM

సౌండ్ తగ్గించమన్నాడని హత్య - Sakshi

సౌండ్ తగ్గించమన్నాడని హత్య

లౌడ్ స్పీకర్ విషయంలో జరిగిన ఘర్షణ వృద్ధుడి హత్యకు దారి తీసింది.

చాదర్‌ఘాట్: లౌడ్ స్పీకర్ విషయంలో జరిగిన ఘర్షణ వృద్ధుడి హత్యకు దారి తీసింది.  చాదర్‌ఘాట్ పోలీసుల కథనం ప్రకారం... అజంపురాలో నివాసం ఉండే సయ్యద్ నూరోద్దిన్ (65) ఇంటి పక్కనే ఎలక్ట్రీషియన్ రాజేష్ (28) నివాసం ఉంటున్నాడు. రాజేష్ రెండు నెలలుగా తన ఇంటిపైభాగంలో లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసి ఎక్కువ సౌండ్ పెడుతున్నాడు. తమకు ఇబ్బందిగా ఉంటోందని సౌండ్ తగ్గించమని నూరోద్దిన్... రాజేష్ తల్లితో రోజూ గొడవ పడుతున్నాడు. ఈ విషయాన్ని తల్లి రాజేష్‌కు చెప్పగా... కోపోద్రిక్తుడైన రాజేష్ ఇంట్లోని తల్వార్‌తో నూరోద్దిన్ చెయ్యి నరకడంతో పాటు తలపై దాడి చేశాడు.

దీంతో నూరోద్దిన్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి నూరోద్దిన్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.  స్థానికంగా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా చాదర్‌ఘాట్ సీఐ వెంకట్‌రెడ్డి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితుడు రాజేష్‌ను పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement