నాణ్యమైన విద్యకు ‘క్విప్‌’ | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యకు ‘క్విప్‌’

Published Tue, Jan 9 2018 2:23 AM

Higher Education Council to exercise for quality education - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాల కోసం పక్కా చర్యలు చేపట్టాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఉన్నత విద్య క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రాం (ది క్విప్‌) పేరుతో కార్యాచరణకు చర్యలు చేపట్టింది. ఇన్నాళ్లు సలహా సంస్థగానే పనిచేసిన ఉన్నత విద్యా మండలి ఇకపై వర్సిటీల్లో అంతర్గత నాణ్యత మెరుగుదలకు నిధులిచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకు వీటి నుంచి ప్రతిపాదనలు స్వీకరించాలని నిర్ణయించింది. తద్వారా వాటిలో నాణ్యత ప్రమాణాలకు పెద్దపీట వేయొచ్చని యోచిస్తోంది.

ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ పాపిరెడ్డి అధ్యక్షతన సోమవారం పాలక మండలి సమావేశమైంది. క్విప్‌తో పాటు అధ్యాపకుల్లో నైపుణ్యాలను పెంచే కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు ప్రత్యేకంగా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు వచ్చారు. పరిశోధనలకు ప్రాధాన్యమిచ్చేందుకు ఏటా 10 నుంచి 12 మందికి రాష్ట్ర స్థాయి ఉత్తమ పరిశోధన అవార్డులివ్వాలని, ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రాం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఐటీ శాఖ ఆధ్వర్యంలో పారిశ్రామిక రంగాల వారితో త్వరలో సమావేశమై దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. 

ఒక్కో ఇంక్యుబేటర్‌కు రూ.2 కోట్లు.. 
ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూ, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ, ఆర్‌జీయూకేటీలలో ఏర్పాటు చేయనున్న ఐదు ఇంక్యుబేటర్లకు రూ.2 కోట్ల చొప్పున ఇచ్చేందుకు ఐటీ శాఖ ఒప్పుకొందని పేర్కొన్నారు. త్వరలోనే వాటిని ఐటీ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారని చెప్పారు.   

Advertisement
Advertisement