భూకుంభకోణం... సీబీఐకి హైకోర్టు నోటీసులు | High Court notices to CBI on Miyapur land scam | Sakshi
Sakshi News home page

మియాపూర్‌ భూకుంభకోణంలో... సీబీఐకి హైకోర్టు నోటీసులు

Aug 17 2017 2:27 AM | Updated on Aug 31 2018 8:34 PM

మియాపూర్‌ భూకుంభకోణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, సీబీఐకి, ప్రతివాదులకు ఉమ్మడి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

సాక్షి, హైదరాబాద్‌: మియాపూర్‌ భూకుంభకోణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, సీబీఐకి, ప్రతివాదులకు ఉమ్మడి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.ఈ కుంభకోణం పరిధి మియాపూర్‌ను దాటి విస్తరించిందని, ప్రముఖుల పాత్ర ఉందని, సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ బీజేపీ నేత, న్యాయవాది రఘునందన్‌రావు వేసిన పిల్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ బుధవారం మరోసారి విచారణ జరిపింది. కేంద్ర, రాష్ట్రాలు, సీబీఐ, ప్రతివాదులు తమ వాదనలతో కౌంటర్‌ పిటిషన్లు దాఖలు చేయాలని ఆదేశించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement