జస్టిస్ ప్రసాద్‌కు హైకోర్టు ఘన నివాళి | great tribute to high court justice prasad | Sakshi
Sakshi News home page

జస్టిస్ ప్రసాద్‌కు హైకోర్టు ఘన నివాళి

Sep 26 2014 12:24 AM | Updated on Aug 31 2018 8:26 PM

అనారోగ్యంతో మృతి చెందిన విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సి.హెచ్.ఎస్.ఆర్.కె.ప్రసాద్‌కు హైకోర్టు గురువారం ఘనం గా నివాళులర్పించింది.

సాక్షి, హైదరాబాద్: అనారోగ్యంతో మృతి చెందిన విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సి.హెచ్.ఎస్.ఆర్.కె.ప్రసాద్‌కు హైకోర్టు గురువారం ఘనంగా నివాళులర్పించింది. జస్టిస్ ప్రసాద్‌కు శ్రద్ధాంజలి ఘటించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా నేతృత్వంలో న్యాయమూర్తులందరూ సమావేశమయ్యారు. ఏపీ, తెలంగాణ అడ్వకేట్స్ జనరల్ పి.వేణుగోపాల్, కె.రామకృష్ణారెడ్డిలు ప్రసాద్ సేవలను కొ నియాడారు. న్యాయవ్యవస్థకు ఆయ న అందించిన సేవలను ప్రధాన న్యా యమూర్తి గుర్తు చేశారు. అనంతరం రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో జస్టిస్ ప్రసాద్ కుటుంబ సభ్యులు, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎ.గిరిధరరావు, అదనపు ఏజీలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు,  న్యాయవాదు  లు పాల్గొన్నారు.   సంతాపంగా మధ్యాహ్నం 3 గంటల తరువాత హై కోర్టు కార్యకలాపాలను రద్దు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement