మనస్తాపంతో ప్రభుత్వ టీచర్ ఆత్మహత్య | Govt teacher commits suicide, probe underway | Sakshi
Sakshi News home page

మనస్తాపంతో ప్రభుత్వ టీచర్ ఆత్మహత్య

Dec 8 2016 6:35 PM | Updated on Nov 6 2018 7:56 PM

ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో సీహెచ్ అలివేలు మంగమ్మ (50) టీచర్ గా పనిచేస్తోంది. తల్లిదండ్రులు శేషచారి, శశిరేఖలతో కలిసి శంషాబాద్ లోని ఆర్బీనగర్‌లో నివాసముంటోంది. 
 
పదేళ్ల కింద భర్తతో విడాకులు తీసుకున్న అలివేలు మంగమ్మకు ఓ కూతురు ఉంది. గురువారం తల్లిదండ్రులు కుక్కకు వైద్యం చేయించడానికి బయటికి వెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి ఒంటరిగా ఉన్న కూతురు ఫ్యాన్ కు ఉరేసుకుని కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురైన వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement