‘న్యాక్‌’కు బంగారు నెమలి | Golden Peacock to National Academy of Construction | Sakshi
Sakshi News home page

‘న్యాక్‌’కు బంగారు నెమలి

Mar 29 2017 12:21 AM | Updated on Sep 2 2018 5:28 PM

ఉన్నత శిక్షణతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌(న్యాక్‌)..

‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌’ పురస్కారానికి ఎంపిక

సాక్షి, హైదరాబాద్‌: ఉన్నత శిక్షణతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌(న్యాక్‌).. ప్రతిష్టాత్మక ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌’బంగారు నెమలి పురస్కారానికి ఎంపికైంది. ఈ అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలోని భారత విభాగం ఈ సంవత్సరం ఉత్తమ శిక్షణ ప్రమాణాలు పాటించినందుకు ‘న్యాక్‌’ను ఎంపిక చేసింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అరిజిత్‌ పసాయత్‌ ఆధ్వర్యంలోని జ్యూరీ న్యాక్‌ను ఎంపిక చేసిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

వచ్చే నెల 19న దుబాయ్‌లో జరిగే కార్యక్రమంలో యూఏఈ ఆర్థికమంత్రి సుల్తాన్‌ బిన్‌సయీద్‌ అల్‌మన్సూరీ ‘న్యాక్‌’డైరెక్టర్‌ జనరల్‌ భిక్షపతికి పురస్కారాన్ని అందించనున్నారు. న్యాక్‌ ఈ ఘనత సాధించినందుకు సంతోషంగా ఉందని సంస్థ చైర్మన్‌ హోదాలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సంస్థ డీజీ, సిబ్బందిని అభినందించారని, దీంతో సంస్థ ఖ్యాతి మరింత ఇనుమడిస్తుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement