అభిమానుల కోసం ఐపీఎల్ ట్రోఫీ | For fans of the IPL trophy | Sakshi
Sakshi News home page

అభిమానుల కోసం ఐపీఎల్ ట్రోఫీ

Jun 3 2016 11:44 PM | Updated on Sep 4 2017 1:35 AM

అభిమానుల కోసం ఐపీఎల్ ట్రోఫీ

అభిమానుల కోసం ఐపీఎల్ ట్రోఫీ

ఐపీఎల్-9లో చాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్ జట్టు సాధించిన ట్రోఫీని అభిమానులు చూసే అవకాశాన్ని కల్పించింది ఆ ....

హైదరాబాద్: ఐపీఎల్-9లో చాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్ జట్టు సాధించిన ట్రోఫీని అభిమానులు చూసే అవకాశాన్ని కల్పించింది ఆ జట్టు యాజమాన్యం. ఐపీఎల్ ట్రోఫీని శనివారం ఇనార్బిట్ మాల్‌లో, ఆదివారం ఫోరం సుజనామాల్‌లో ప్రదర్శించనున్నట్లు తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వ రకు ట్రోఫీని అభిమానులకు అందుబాటులో ఉంచుతారు. జట్టు గెలవడంలో హైదరాబాదీల సహకారం మరువలేనిదని యాజమాన్యం పేర్కొంది.


‘అభిమానుల సహకారం, వారి ప్రోత్సాహం జట్టులో స్ఫూర్తిని కలిగించాయి. వీరి అభిమానమే జట్టు విజేతగా నిలిచి కప్ గెలవడానికి కారణమైంది. వారి సహకారాన్ని గుర్తించేందుకు మేము చేస్తున్న చిన్న ప్రయత్నం ఇది’ అని సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కె. షణ్ముగం వ్యాఖ్యానించారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement