ఏసీబీకి చిక్కిన కుటుంబ సంక్షేమ శాఖ ఏడీ | Family Welfare department AD caught to the ACB | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన కుటుంబ సంక్షేమ శాఖ ఏడీ

Jan 18 2017 2:43 AM | Updated on Aug 17 2018 12:56 PM

ఏసీబీకి చిక్కిన కుటుంబ సంక్షేమ శాఖ ఏడీ - Sakshi

ఏసీబీకి చిక్కిన కుటుంబ సంక్షేమ శాఖ ఏడీ

డిప్యుటేషన్‌కు సంబంధించిన ఉత్తర్వుల జారీకిగాను రూ.12 వేలు లంచం తీసుకుంటూ రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ

రూ. 17 వేల నగదు స్వాధీనం

హైదరాబాద్‌: డిప్యుటేషన్‌కు సంబంధించిన ఉత్తర్వుల జారీకిగాను రూ.12 వేలు లంచం తీసుకుంటూ రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదనపు సంచాల కులు (అడ్మిన్‌–1) ఎం.సంజీవరావు, అటెండర్, డ్రైవర్‌ మంగళవారం ఇక్కడ అవినీతి నిరోధకశాఖ అధికారుల కు చిక్కారు. వివరాలను సిటీ రేంజ్‌–1 అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ అశోక్‌కుమార్‌ వెల్లడించారు. వరంగల్‌ జిల్లా దామెర పీహెచ్‌సీ ఫార్మాసిస్టు శైలజ వరంగల్‌ జిల్లాలోని సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టోర్‌కు డిప్యుటేషన్‌ ఇవ్వాలని కోరడంతో వైద్య, ఆరోగ్యశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ ఎం.సంజీవరావు నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేశారు.

శైలజకు డిప్యుటేషన్‌ మీద సెంట్రల్‌ డ్రగ్స్‌స్టోర్‌కు వేయాలని కమి టీ నిర్ణయించింది. ఉత్తర్వుల జారీకిగాను సంజీవరావు శైలజను రూ.12 వేలు డిమాండ్‌ చేశారు. దీనిపై శైలజ బంధువు రజనీకాంత్‌ ఈ నెల 16న ఏసీబీని  ఆశ్రయించ డంతో అధికారులు సంజీవరావుపై నిఘా పెట్టారు. ఏడీ డ్రైవర్‌  తౌఫిక్‌  రూ.15 వేలు, అటెండర్‌ అంబర్‌బాబా మరో రూ.2 వేలు తీసుకుంటుం డగా ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. దాడుల్లో ఏసీబీ సీఐలు రవీందర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రావు, రాజేశ్, మంజుల పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement