12 మంది ఐఏఎస్‌లకు ఎక్సలెన్స్‌ అవార్డులు | Excellence Awards for 12 IAS officers | Sakshi
Sakshi News home page

12 మంది ఐఏఎస్‌లకు ఎక్సలెన్స్‌ అవార్డులు

Aug 14 2017 2:21 AM | Updated on Sep 27 2018 3:20 PM

రాష్ట్రంలోని 12 మంది ఐఏఎస్‌ అధికారులు, వారి బృందాలకు రాష్ట్ర ప్రభుత్వం 2017 ఎక్సలెన్స్‌ అవార్డులను ప్రకటించింది.

పంద్రాగస్టు వేడుకల్లో పురస్కారాలు
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 12 మంది ఐఏఎస్‌ అధికారులు, వారి బృందాలకు రాష్ట్ర ప్రభుత్వం 2017 ఎక్సలెన్స్‌ అవార్డులను ప్రకటించింది. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ప్రభుత్వం అవార్డు గ్రహీతలకు పురస్కారాలను అందజేయనుంది. మూడు కేటగిరీల్లో ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటించింది. వినూత్న కార్యక్రమాల అమలు, ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాల అమలు, పనితీరు కేటగిరీల్లో వ్యక్తిగత, గ్రూపు, సంస్థలుగా అవార్డులను నిర్ణయించింది. సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి శాలిని మిశ్రా ఆదివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 
 
వినూత్న కార్యక్రమాలు: 1. ఎ.దేవసేన–జనగాం కలెక్టర్‌ (ప్రభుత్వ పాఠశాలల బాలికలకు మార్షల్‌ ఆర్ట్స్, స్వీయ రక్షణ శిక్షణ కార్యక్రమాలు) 
2.జ్యోతి బుద్ధ ప్రకాశ్‌–ఆదిలాబాద్‌ కలెక్టర్, ఐఏఎస్‌లు ఆర్వీ కర్ణన్, అనురాగ్‌ జయంతి (ఉట్నూర్‌ ఐటీడీఏలో స్టార్‌–30 కార్యక్రమం) 
3. టి.చిరంజీవులు–హెచ్‌ఎండీఏ కమిషనర్, హెచ్‌ఎండీఏ (డెవలప్‌మెంట్‌ పర్మిషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌) 
జనరల్‌: 1.డి.యోగితారాణా–నిజామాబాద్‌ కలెక్టర్‌ (మానవతా సదన్, హెచ్‌ఐవీ బాధిత పిల్లల పునరావాస ప్రాజెక్టు)  2. ఏ.మురళి–భూపాలపల్లి కలెక్టర్, డీఎంహెచ్‌వో అప్పయ్య, ములుగు–గోపాల్, చిట్యాల–రవి ప్రవీణ్‌రెడ్డి, ఏటూరునాగారం–అపర్ణ, మహదేవ్‌పూర్‌–వాసుదేవరెడ్డి (జిల్లాలోని ప్రభుత్వాసుపత్రులపై ప్రజలకు విశ్వాసం కల్పించడం) 3. డాక్టర్‌ శరత్‌–జగిత్యాల కలెక్టర్, జిల్లా సివిల్‌ సప్లైస్‌ విభాగం (ధాన్యం సేకరణ) 
ప్రతిష్టాత్మక కార్యక్రమాలు:  1. మిషన్‌ భగీరథ: వెంకట్రామరెడ్డి–సిద్దిపేట కలెక్టర్, ఆర్‌డబ్ల్యూఎస్‌ విభాగం 2. మిషన్‌ కాకతీయ: రాజీవ్‌గాంధీ హన్మంతు–భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్, ఇరిగేషన్‌ విభాగం 
3. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌: జ్యోతి బుద్ధ ప్రకాశ్‌–ఆదిలాబాద్‌ కలెక్టర్, కె.కృష్ణారెడ్డి–జాయింట్‌ కలెక్టర్, సీహెచ్‌.సూర్యనారాయణ–ఆర్‌డీవో, ఆర్‌.అర వింద్‌కుమార్‌–సూపరింటెండెంట్‌ 4.హరితహారం: సురేంద్రమోహన్‌–సూర్యాపేట కలెక్టర్‌ 5. హరితహారం: ప్రస్థాన్‌ జె.పాటిల్‌–వరంగల్‌ రూరల్‌ కలెక్టర్‌ 6. ఆరోగ్యలక్ష్మి: గౌరవ్‌ ఉప్పల్‌–నల్లగొండ కలెక్టర్, మహిళా శిశు సంక్షేమ విభాగం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement