నగరంలో అత్యంత రద్దీగా ఉండే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉన్న ఓ బస్ స్టాపులో బస్సు కోసం వేచి చూస్తున్న యువతిని నవీన్ అనే యువకుడు వేధించాడు.
నగరంలో పోకిరీల బెడద రోజురోజుకు పెరిగిపోతోంది. సిటీ బస్సు కోసం వేచి ఉంటున్న యువతులు, మహిళలే లక్ష్యంగా రెచ్చిపోతున్నారు. తాజాగా నగరంలో అత్యంత రద్దీగా ఉండే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉన్న ఓ బస్ స్టాపులో బస్సు కోసం వేచి చూస్తున్న యువతిని నవీన్ అనే యువకుడు వేధించాడు.
కొంతసేపటి వరకు ఎందుకులే అని ఊరుకున్నా, తర్వాత భరించలేని ఆమె గట్టిగా ఎదురు తిరిగింది. దాంతో స్థానికులు కూడా అతడిని పట్టుకుని, దేహశుద్ధి చేశారు. అనంతరం పోకిరీ నవీన్‌ను పోలీసులకు అప్పగించారు.