మన ఎలక్షన్స్ డాట్‌కామ్’ ప్రారంభం | Elections of the virus start | Sakshi
Sakshi News home page

మన ఎలక్షన్స్ డాట్‌కామ్’ ప్రారంభం

Mar 10 2014 1:00 AM | Updated on Aug 14 2018 9:04 PM

మన ఎలక్షన్స్ డాట్‌కామ్’ ప్రారంభం - Sakshi

మన ఎలక్షన్స్ డాట్‌కామ్’ ప్రారంభం

రాజకీయ నేతలు, ప్రజలకు వారధిగా మన ఎలక్షన్స్ డాట్‌కామ్ వెబ్‌సైట్ పనిచేస్తుందని వెబ్‌సైట్ రూపకర్తలు శ్రీనివాస్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

 రాజకీయ నేతలు, ప్రజలకు వారధిగా మన ఎలక్షన్స్ డాట్‌కామ్ వెబ్‌సైట్ పనిచేస్తుందని వెబ్‌సైట్ రూపకర్తలు శ్రీనివాస్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో టీఆర్‌ఆర్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ టి.రామ్మోహన్‌రెడ్డి ఆదివారం ఈ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... వెబ్‌సైట్‌లో అన్ని పార్టీల, అన్ని నియోజకవర్గాల అభ్యర్థుల వివరాలు, ఆయా పార్టీ అధినాయకత్వం వివరాలు, వారి జీవిత చరిత్రలు, ఎన్నికల మ్యానిఫెస్టో వివరాలు పొందుపర్చినట్లు వెల్లడించారు. అమెరికాలో ఒబామా గెలుపులో సోషల్ మీడియా విశిష్ట పాత్రను పోషించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో 85 కోట్ల ఓటర్లు ఉంటే ఈసారి పది శాతం ఓటర్ల సంఖ్య పెరిగిందన్నారు.

ఈ పది శాతం మొత్తం యువకులేనని, యువత ఎక్కువగా ఉపయోగించే స్మార్ట్‌ఫోన్లలో ఈ వెబ్‌సైట్‌ను డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. ప్రవాసాంధ్రులు వారి నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి, ఏ పనికి ఎంత మొత్తంలో నిధులు మంజూరయ్యాయి తదితర వివరాలు ఈ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement