‘ఎర్లీబర్డ్స్’ చిక్కారు! | 'Early Birds' implications! | Sakshi
Sakshi News home page

‘ఎర్లీబర్డ్స్’ చిక్కారు!

Feb 23 2016 12:16 AM | Updated on Sep 3 2017 6:11 PM

నగరంతో పాటు శివార్లలోనూ తెల్లవారుజామున సంచరిస్తూ చైన్‌స్నాచింగ్స్‌కు పాల్పడుతున్న ముఠా గుట్టును

సిటీబ్యూరో: నగరంతో పాటు శివార్లలోనూ తెల్లవారుజామున సంచరిస్తూ చైన్‌స్నాచింగ్స్‌కు పాల్పడుతున్న ముఠా గుట్టును సైబరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీసులు రట్టు చేశారు. కొందరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగిలిన వారిని పట్టుకోవడంతో పాటు సొత్తు రికవరీపై దృష్టి పెట్టారు. గతేడాది డిసెంబర్‌తో పాటు ఈ ఏడాదీ జంట కమిషనరేట్ల పరిధిలో తెల్లవారుజాము సమయంలో అనేక స్నాచింగ్స్ జరిగాయి. ఇంటి ముందు ముగ్గు వేసుకుంటున్న, పనులు చేసుకుంటున్న మహిళల్ని టార్గెట్ చేసుకునే ఈ ముఠా వరుస పెట్టి పంజా విసిరింది.

వీరి బారినపడ్డ వారిలో కొందరు క్షతగాత్రులూ అయ్యారు. కాస్త దూరంలో వాహనాన్ని స్టార్ట్ చేసుకుని ఓ స్నాచర్ వేచి ఉండటం, నడుచుకుంటూ వచ్చే మరో స్నాచర్ ఏదో ఒక రకంగా మహిళలతో మాట కలిపి మెడలోని నగలు స్నాచింగ్ చేసుకుపోవడం వీరి నైజం. ఈ పంథాలో రెచ్చిపోతున్న గ్యాంగ్ ఉత్తరప్రదేశ్‌కు చెందినదిగా సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటి వరకు వీరు హైదరాబాద్, సైబరాబాద్‌ల్లో 45 స్నాచింగ్స్ చేసినట్లు అంగీకరించారని తెలిసింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement