బ్యాంక్ లోన్లు ఇప్పిస్తామంటూ రూ. 10 కోట్లకు టోకరా | Delhi gang arrested who cheat people, collect 10 crores rupees | Sakshi
Sakshi News home page

బ్యాంక్ లోన్లు ఇప్పిస్తామంటూ రూ. 10 కోట్లకు టోకరా

Sep 7 2015 3:43 PM | Updated on Sep 3 2017 8:56 AM

బ్యాంక్ లోన్లు ఇప్పిస్తామంటూ రూ. 10 కోట్లకు టోకరా

బ్యాంక్ లోన్లు ఇప్పిస్తామంటూ రూ. 10 కోట్లకు టోకరా

తక్కువ వడ్డీకి బ్యాంక్ లోన్లు ఇప్పిస్తామంటూ మోసం చేసి, 10 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఢిల్లీ ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్: తక్కువ వడ్డీకి బ్యాంక్ లోన్లు ఇప్పిస్తామంటూ మోసం చేసి,  10 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఢిల్లీ ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి, నిందితుల ఫొటోలను విడుదల చేశారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు..

ఈ ముఠా దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో 522 మందిని మోసం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 150 మందికి టోకరా వేశారు. బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీలకు లోన్లు ఇప్పిస్తామని నమ్మబలికి, బాధితుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. అనంతరం రుణం మంజూరైందంటూ నకిలీ పత్రాలు సృష్టించి జనాన్ని మోసం చేశారు. చివరకు మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement