'అందుకే టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నారు' | D Sravan kumar takes on trs leaders | Sakshi
Sakshi News home page

'అందుకే టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నారు'

Feb 11 2016 4:24 PM | Updated on Jul 11 2019 8:26 PM

'అందుకే టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నారు' - Sakshi

'అందుకే టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నారు'

గ్రేటర్ ఎన్నికల్లో నోటా ఆప్షన్ తొలగించడం రాజ్యాంగ ఉల్లంఘనే అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డా. డి. శ్రవణ్ ఆరోపించారు.

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో నోటా ఆప్షన్ తొలగించడం రాజ్యాంగ ఉల్లంఘనే అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డా. డి. శ్రవణ్ ఆరోపించారు. గురువారం హైదరాబాద్లో డి.శ్రవణ్ విలేకర్లతో మాట్లాడుతూ... గతంలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని గతంలో సీఎం కేసీఆర్ ఆరోపించారని... అలాంటిది ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

ఈవీఎంల ట్యాంపరింగ్ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే... టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకుంటూ రాజకీయాలు చేస్తున్నారని టీఆర్ఎస్ నాయకులపై శ్రవణ్ మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement