శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు.
ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం: హైదరాబాదీ అరెస్టు
Mar 6 2017 12:54 PM | Updated on Aug 2 2018 4:35 PM
శంషాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో ఓ ప్రయాణికుడి వద్ద నుంచి 376 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద నుంచి 376 గ్రాముల బంగారం పట్టుబడింది. బంగారానికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో అధికారులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం రూ. 11 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. బంగారం తరలిస్తున్న వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన వాడిగా గుర్తించారు.
Advertisement
Advertisement